తాజాగా దుల్కర్ సల్మాన్ "లక్కీ భాస్కర్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... వెంకీ అట్లూరిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి నెట్ ఫ్లిక్స్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇకపోతే తాజాగా స్టార్ హీరోల సినిమాలకు కూడా సాధ్యం కానీ రికార్డును దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన లక్కీ భాస్కర్ సినిమా సాధించింది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు 13 వారాలుగా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ లో నిలిచిన మొట్ట మొదటి సౌత్ ఇండియా ఫిల్మ్ గా లక్కీ భాస్కర్ నిలిచినట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఈ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ , మీనాక్షి చౌదరి జంటకు మంచి ప్రశంసలు లభించాయి. అలాగే వీరిద్దరి నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాను రూపొందించిన విధానానికి గాను వెంకీ అట్లూరి కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: