టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య "జోష్" అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఏమాయ చేసావే అనే మూవీ తో ప్రేక్షకులను చైతూ పలకరించాడు. ఈ మూవీ మంచి సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ 2016 వ సంవత్సరం ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 15 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమాకు ఆ సమయంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.30 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.73 కోట్లు , ఉత్తరాంధ్ర లో 1.28 కోట్లు , ఈస్ట్ లో 54 లక్షలు , వెస్ట్ లో 58 లక్షలు , గుంటూరు లో 1.23 కోట్లు , కృష్ణ లో 66 లక్షలు , నెల్లూరులో 47 లక్షల కలెక్షన్లు దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 9.99 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 లక్షలు , ఓవర్సీస్ లో ఒక కోటి కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 11.79 కోట్ల కలక్షన్లు దక్కాయి. ఈ మూవీ ఫుల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 11.79 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ ద్వారా బయ్యర్లకు 2.79 కోట్ల లాభాలు దక్కాయి. అలా ఈ మూవీ మంచి విజయాన్ని ఆ సమయంలో అందుకుంది. ఈ మూవీ లో సమంత హీరోయిన్గా నటించగా ... గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc