టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ ని ఈ సంవత్సరం సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబో లో రూపొందబోయే సినిమాని సాహు గారపాటి నిర్మించబోతున్నాడు. ఈ ముగ్గురు కూడా ఈ సినిమాకు సంబంధించిన అనేక అప్డేట్లను ఇప్పటికే తెలియజేశారు. ఈ సినిమా యొక్క షూటింగ్ ఈ సంవత్సరం సమ్మర్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు చిరంజీవి కొన్ని రోజుల క్రితం ప్రకటించాడు. ఇకపోతే అనిల్ రావిపూడి కామెడీ సినిమాలను రూపొందించడంలో దిట్ట. ఈయన ఇప్పటి వరకు ఎన్నో కామెడీ ఓరియంటెడ్ సినిమాలను రూపొందించి అదిరిపోయే రేంజ్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇకపోతే చిరంజీవి కూడా కామెడీని వెండి తెరపై అద్భుతంగా పండించడంలో దిట్ట.

దానితో చిరంజీవి తో తీయబోయే సినిమాను కూడా అనిల్ రావిపూడి అదిరిపోయే రేంజ్ కామెడీ కథతో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు అనిల్ దర్శకత్వంలో రూపొందిన ఏ సినిమాలో కూడా హీరో పాత్ర రెండు పాత్రలలో నటించలేదు. ఈ సారి సరి కొత్తగా చిరంజీవి ని అనిల్ రెండు పాత్రలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ స్టార్ట్ కాక ముందే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: