తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో సందీప్ కిషన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరో గా నటించాడు. అందులో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా ఈయన ఎక్కువ శాతం డిఫరెంట్ జోనర్ సినిమాల్లో నటిస్తూ రావడంతో ఈయనకు మంచి క్రేజ్ సినీ అభిమానుల్లో ఉంది. ఇకపోతే తాజాగా ఈ నటుడు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన మజాకా అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రీతూ వర్మ హీరోయిన్గా నటించగా ... రావు రమేష్ , అన్షు అంబానీ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ని నిన్న అనగా ఫిబ్రవరి 26 వ తేదీన ప్రపంచకవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై జనాలు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమాకి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర యావరేజ్ టాక్ దక్కింది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు పెద్ద స్థాయిలో కలెక్షన్లు దక్కే అవకాశాలు కనిపించడం లేదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

ఇకపోతే ఈ మూవీ కి బుక్ మై షో లో మాత్రం 24 గంటల్లో ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయిలో రెస్పాన్స్ లభించలేదు. బుక్ మై షో యాప్ లో 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించిన 28.71 కే టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk