
రీసెంట్గా ఆయన నటించిన "తండేల్" సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాకుండా ఆయన ఎప్పటినుంచి కలలో కట్టుకున్న 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు . దీంతో సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గానే అక్కినేని నాగచైతన్య నటించిన "తండేల్" మూవీ వంద కోట్లు క్రాస్ చేసిన సందర్భంగా ఫుల్ గ్రాండ్గా సక్సెస్ పార్టీ ఇచ్చారు. అయితే ఇదే మూమెంట్లో ఓ విషయం బయటపడింది.
నాగార్జున కెరియర్ లో ఎంతో స్పెషల్ గా తెరకెక్కబోతున్న ఆయన 100వ సినిమా చేసే డైరెక్టర్ పేరు బయటకు వచ్చింది. ఆయన మరెవరో కాదు విశ్వంభర సినిమాతో మరో హ్యూజ్ హిట్ అందుకోవాలి అనుకుంటున్న వశిష్ట. మనకు తెలిసిందే ఆల్ రెడీ వశిష్ట బింబిసారా తో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు . మరోసారి విశ్వంభర తో ఆయన మార్క్ చూయించబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది . చిరంజీవి లాంటి స్టార్ డైరెక్టర్ విశ్వంభర ద్వారా వశిష్ట కి ఛాన్స్ ఇచ్చాడు . ఇప్పుడు నాగార్జున కూడా అదే చేస్తున్నాడట . ఆయన కెరియర్ లోనే ఎప్పుడు మర్చిపోలేనటువంటి ఆయన వందవ సినిమాని విశ్వంభర డైరెక్టర్ విశిష్ట చేతికి ఇచ్చాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం నో డౌట్ ఇక ఇండస్ట్రీలో వశిష్ట ని అడ్డుకునే వాళ్లే లేరు . ఆయన కెరియర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోవడం ఖాయం..!