సినిమా ఇండస్ట్రీలో ఎవరు ప్లేస్ ఎప్పటికీ శాశ్వతం కాదు . అది అందరికీ తెలిసిందే. ఒక హీరో కావచ్చు ..హీరోయిన్ కావచ్చు ..డైరెక్టర్ కావచ్చు ..ప్రొడ్యూసర్ కావచ్చు . ఎవరైనా సరే ఆ ప్లేస్ కొన్నాళ్ల మాత్రమే వాళ్ళకి దక్కుతుంది . ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆస్థానం వేరే వాళ్లకి వెళ్తూ ఉంటుంది.  అయితే ప్రెసెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక ముందన్నా గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . రష్మిక మందన్నా  ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు .

రష్మిక మందన్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సూపర్ సూపర్ హిట్ అవ్వడమే అందుకు కారణం . అయితే రష్మిక మందన్నా ఎప్పుడు కూడా ఇలానే టాప్ మోస్ట్ స్ధానాని కంటిన్యూ చేస్తుందా..? అంటే నో అని చెప్పాలి .  రష్మిక మందన్నా  స్థానాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తే ఏ హీరోయిన్ సెట్ అవుతుంది అన్న టాక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. కాగా ఫ్యూచర్ లో రష్మిక మందన్నా ప్లేస్ ని రీప్లేస్ చేయాల్సి వస్తే కచ్చితంగా అది కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఆ లోటుని తీర్చేస్తుంది .

అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఇస్తుంది . ఫ్యూచర్లో కాబోయే రష్మిక మందన్నా ఈ రుక్మిణి వసంత్ అని మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో రుక్మిణి వసంత్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమాలోనూ హీరోయిన్ రుక్మిణి వసంత్ గా సెలక్ట్ అయ్యింది. మరోక తెలుగు సినిమాలో కూడా ఈమె హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి రష్మిక నేషనల్ క్రష్ ట్యాగ్ ని ఈ బ్యూటీ ఎంత వరకు ఫుల్ ఫిల్ చేస్తుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: