టాలీవుడ్ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వ ప్రతిభ గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ యావత్ భారతీయ సినిమా దృష్టిని ఆకర్శించాడు. ఈ క్రమంలో ఆయన అర్జున్ రెడ్డి తెలుగు మాతృకను బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించారు. ఆ తరువాత బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌ హీరోగా నటించిన సినిమా 'యానిమల్‌' 2023 డిసెంబర్ లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏకంగా రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి తెలుగోడి సత్తాను బాలీవుడ్లో చాటింది. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు!

సందీప్ దెబ్బకు బాలీవుడ్ మొత్తం కుల్లుకుంది. ఈ క్రమంలో ఎంతోమంది రివ్యూవర్లు, సెలిబ్రిటీలు సందీప్ పై విమర్శల దాడికి దిగారు. అయితే తెలివైన సందీప్ వాటికి ధీటుగా సమాధానం చెప్పాడు. వైలెన్స్ మరీ ఎక్కువైందని, మహిళలను తక్కువ చేసి చూపించారంటూ సందీప్ వంగాపై ట్రోల్స్ చేయడం అందరికీ తెలిసిందే. అదే సమయంలో హీరో రణబీర్ ని మాత్రం చాలామంది ఆకాశానికెత్తేశారు. దీనిపై దర్శకుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బాలీవుడ్ ప్రముఖులపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

సందీప్ మాట్లాడుతూ... ''యానిమల్‌ సినిమాని బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ జనాలే బ్యాడ్ గా విమర్శించారు. కానీ రణబీర్ కపూర్ ను మాత్రం చాలా మెచ్చుకున్నారు. ఈ విషయంలో నేను రణబీర్ మీద జెలసీ ఫీల్ అవ్వడం లేదు. రణ్‌బీర్‌ తెలివైన వ్యక్తే కావచ్చు.. మరి రైటర్, డైరెక్టర్ పరిస్థితేంటి? 'కబీర్ సింగ్' సినిమాలో నటించాడనే కారణంతో ఒక నటుడికి ఓ సో కాల్డ్ నిర్మాణ సంస్థ అవకాశం ఇవ్వలేదు. బాంబేలో ఓ పెద్ద ప్రొడక్షన్ కంపెనీకి ఆడిషన్ ఇవ్వడానికి అతను వెళ్లగా... 'నువ్వు కబీర్ సింగ్ మూవీలో ఉన్నావ్ కదా.. మేము నిన్ను తీసుకోవడం కుదరదు' అని చెప్పి పంపించేశారట. ఇది ఎంత దారుణం. ఇప్పుడు వాళ్ళు అదే విధంగా రణబీర్ కపూర్ కి చెప్తారా? త్రిప్తిని, రష్మికని తీసుకోవద్దని.. విశాల్ మిశ్రాని తీసుకోవద్దని చెప్పగలరా?" అంటూ మండిపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: