
కానీ అప్పటినుంచి నాపై అనవసరమైన ద్వేషం ప్రారంభమైందని ప్రియమణి కామెంట్లు చేశారు. నాపై లవ్ జిహాద్ ఆరోపణలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలను ఐసిస్ లో జాయిన్ చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారని ఆ కామెంట్లు ఎంతో బాధ పెట్టాయని ప్రియమణి తెలిపారు. నేను మీడియా పర్సన్ కాబట్టి ఆ కామెంట్లను పెద్దగా పట్టించుకోనని ప్రియమణి వెల్లడించారు.
కానీ నా భర్తపై అలాంటి కామెంట్లతో ఎందుకు దాడి చేస్తున్నారని ప్రియమణి ప్రశ్నించారు. నా భర్త గురించి వివరాలు కూడా మీకు తెలియవని కానీ కామెంట్లు మాత్రం చేసేస్తారని ఆమె తెలిపారు. నేను నా భర్తతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తే పదిలో తొమ్మిది కామెంట్లు నా భర్త గురించే ఉంటాయని ఆమె వెల్లడించారు. ఆ కామెంట్ల వల్ల బాధ పడాల్సి వస్తోందని ఆమె అన్నారు.
ప్రియమణి కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ప్రియమణి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రియమణి రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.ప్రియమణి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఒకింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఆమె కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. ప్రియమణి సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించడం కష్టమేం కాదు.