
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇటీవల వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలు వస్తున్నాయి. అఖండ ఆ తర్వాత వీర సింహా రెడ్డి .. భగవంత్ కేసరి ..ఆ తర్వాత డాకూ మహారాజ్ సినిమాలు నాలుగు వరుసగా హిట్లు కొట్టాయి. బాలయ్య రీసెంట్ గా నటించిన సినిమా “ డాకు మహారాజ్ ” ఇపుడు ఓటిటి లో అదరగొడుతుండగా ఇపుడు ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి సాలిడ్ ప్రాజెక్ట్ గా “ అఖండ 2 ” స్టార్ట్ చేశారు. అఖండ లాంటి హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న అఖండ 2 పై అంచనాలు మామూలుగా లేవు.
దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఒక పక్క ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. షూటింగ్ మాత్రమే కాదు ... మిగిలిన కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్ గా జరిగేలా బోయపాటి కసరత్తులు చేస్తున్నారట. ఒక్క షూటింగ్ మాత్రమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో కూడా చేసేస్తున్నారట. అఖండ 2 సినిమా దాదాపు రు. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం బాలయ్య కు రు. 38 కోట్లు .. బోయపాటికి రు. 35 కోట్లు ఇస్తున్నారు.
ఇలా అఖండ 2 లో ఇంటర్వెల్ ఎపిసోడ్ తాలూకా గ్రాఫిక్స్ పనులు స్టార్ట్ చేసేసినట్టు సమాచారం. అంటే షూటింగ్ తో పాటు మిగిలిన పనులు కూడా జెస్ట్ స్పీడ్ లో జరిగిపోతున్నాయని చెప్పాలి. ఇక అఖండ 2 - తాండవం సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.