రామ్‌ నితిన్‌ , నార్నె నితిన్‌ , సంగీత్ శోభన్ , గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో కొంత కాలం క్రితం మ్యాడ్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమా విడుదల అయిన కొన్ని రోజులకే ఈ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాను రూపొందించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాలో కూడా మ్యాడ్ మూవీ లో నటించిన నటీనటులే ఎక్కువ శాతం నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.

ఇకపోతే ఈ సినిమాను కూడా మ్యాడ్ మూవీ మాదిరి గానే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 6.41 మిలియన్ వ్యూస్ , 220 కే లైక్స్ లభించాయి.  ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మూవీ టీజర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: