అవును.. నందమూరి బాలకృష్ణకి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఝలక్ ఇచ్చాడనే రూమర్స్ మిన్నంటున్నాయి. నందమూరి నట వారసుడు అయినటువంటి మోక్షజ్ఞ తేజ కెరీర్ అయోమయంలో పడింది. ఆయన హీరోగా పరిచయం కావాల్సిన మూవీపై ఇపుడు సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తేజ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించిన తరువాత ఇలాంటి రూమర్స్ రావడం ఒకింత బాధాకరం. ఈ మూవీ మొదటి దశలోనే ఆగిపోయిందని గుసగుసలు వినబడుతున్నాయి. దీంతో మోక్షజ్ఞ తేజ హీరోగా ఏ దర్శకుడితో పరిచయం అవుతారనేది ఇపుడు సస్పెన్స్‌ గా మారింది.

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తేజ సినిమా ప్రకటించి, ఈ మూవీతో బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా నిర్మాతగా మారబోతున్నారు అని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. కాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా దానికి సింబా అనే టైటిల్‌ అనుకున్నాని తెలిసింది. సినిమా ప్రారంభం కావాల్సిన సమయంలో సడెన్‌గా ఆగిపోవడంతో నందమూరి అభిమానులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ప్రశాంత్‌ వర్మ కావాలనే ఈ సినిమా నుండి తప్పుకున్నాడని, బాలయ్యకి కథనచ్చకపోవడం వల్లనే ఇలా జరిగిందని పుకార్లు వినిపిస్తున్నాయి.

ప్రశాంత్‌ వర్మ రెడీ చేసిన స్క్రిప్ట్ విషయంలో బాలయ్య సంతృపిగా లేరని, మార్పులు చెప్పారని, అవి మార్చడానికి ప్రశాంత్‌ వర్మ ఆసక్తి చూపలేదని వినికిడి. మరోవైపు తాను కాకుండా తన అసిస్టెంట్‌తో ఈ సినిమాని డైరెక్షన్‌ చేస్తాడని ప్రశాంత్‌ వర్మ ప్లాన్‌ చేశాడని, దీనికి బాలయ్య ఒప్పుకోలేదని, దీంతో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుందని కూడా తెలుస్తోంది. అయితే తాజాగా ప్రశాంత్‌ వర్మ ప్రభాస్‌ మూవీ వైపు షిఫ్ట్ అయ్యారని సమాచారం. ప్రభాస్‌తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో ప్రశాంత్‌ వర్మ దర్శకుడిగా ఓ మూవీ ఓకే అయ్యిందని తెలిసిందే. దీనికి సంబంధించి మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్‌పై టెస్ట్ షూట్‌ చేశారట. అయితే ఈ సినిమా స్పిరిట్‌ తర్వాతనే స్టార్ట్ అవుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: