సినిమా ఇండస్ట్రీ లో చిన్న హీరోలు , మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలో ఆగిపోవడం ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. కానీ స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఎక్కువ శాతం ఆగిపోవడం జరగదు. దానికి ప్రధాన కారణం ఓ స్టార్ హీరోతో ఓ నిర్మాత సినిమాను సెట్ చేసుకున్నాక , కొన్ని కారణాల వల్ల నిర్మాతసినిమా నుండి తప్పుకున్నా కూడా స్టార్ హీరో నటించిన మూవీ కావడం వల్ల ఖచ్చితంగా ఆ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుంది , లాభాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఆ మూవీ ని వేరే ఒక నిర్మాత తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.

దానితో స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఎక్కువ శాతం ఆగిపోవు. ఇక అదే ఒక స్టార్ హీరో , మరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్లో మూవీ రూపొందితే అలాంటి సినిమాలు దాదాపుగా విడుదల కాకుండా ఉండవు. కానీ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో మరియు స్టార్ డైరెక్టర్ కాంబోలో రూపొందిన ఓ సినిమా ఆగిపోయే పరిస్థితి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి కమల్ హాసన్ అదిరిపోయే తమిళ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ కాంబినేషన్లో కొన్ని సంవత్సరాలు క్రితం ఇండియన్ అనే మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా కొంత కాలం క్రితం ఇండియన్ 2 అనే మూవీ ని రూపొందించారు. భారీ అంచనాలు నడప విడుదల అయిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా ఇండియన్ 3 ను కూడా చాలా వరకు కంప్లీట్ చేసినట్లు శంకర్ ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇక శంకర్ ఈ మధ్య కాలంలో రూపొందిన సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్లో రూపొందిన ఇండియన్ 3 మూవీ ప్రొడ్యూసర్స్ అయినటువంటి లైకా సంస్థ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: