- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తాజాగా రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే ఫోటో వైరల్ అవుతుంది. నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినిమా అభిమానులు .. బాలయ్య బాబు అభిమానులు ఆ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బాలయ్య పవర్ ఏంటో తెలిసి వచ్చిందని స్వయంగా కోహ్లీ బాల్యతో సెల్ఫీ దిగాడు అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కట్ చేస్తే ఈ ఫోటోలు ఫేక్ అని తేలింది. గూగుల్లో రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ తో కొంతమంది ఈ ఫోటోల ప్రామాణికతను నిర్ధారించడానికి ప్రయత్నించారు. ఇది నూటికి నూరు శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాయంతో క్రియేట్ చేసినట్టుంది. ఓ క్రికెట్ స్టేడియంలో బాలయ్యతో కోహ్లీ ఈ ఫోటోలు దిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవ‌ల కాలంలో బాలకృష్ణ ఏ క్రికెట్‌ స్టేడియం కూడా సందర్శించలేదు .. అటు కోహ్లీ వేసుకున్న జెర్సీ కూడా ఫేక్ అని గూగుల్ నిర్ధారించింది.


ఒప్పో లోగో ఉన్న జెర్సీని కోహ్లీ ధరించాడు .. ఆ కంపెనీతో బీసీసీఐ ఒప్పందం 2019లోనే ముగిసింది ఏది ఏమైనా ఇటీవల ఏఐ సహాయంతో ఇలాంటి ఫోటోలు సృష్టించడం చాలా ఈజీ అయిపోయింది అవి అన్నింటిని నిజం అనుకోకూడదని టెక్కీ లు హెచ్చరిస్తున్నారు. ఇక బాల‌య్య సినిమాల విష‌యానికి వస్తే సంక్రాంతి కి డాకూ మ‌హారాజ్ సినిమా తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టాడు. ఇక ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం లో అకండ లాంటి హిట్ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తోన్న అఖండ 2 తాండ‌వం సినిమా లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా లో సంయుక్త మీన‌న్ హీరోయిన్ .. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: