
హరిహర వీరమల్లు సినిమా నుంచి ఇప్పటికే ఒక పాటతో పాటు ప్రోమో వచ్చాయి. విడుదలవుతున్న ప్రతి కంటెంట్ మీద మార్చి 28 విడుదల అంటూ డేట్ వేస్తున్నారు .. కానీ అదే డేట్ కు వస్తున్న మరో రెండు సినిమాలు నితిన్ రాబిన్ హుడ్ .. కుర్ర హీరోల మ్యాడ్ 2 సినిమాలు కూడా వెనక్కి తగ్గటం లేదు .. కంటెంట్ మీద కంటెంట్ వదులుతున్నారు. అటు పవన్ సినిమా అదే డేట్ కు వస్తుందని తెలిసి గట్టి పోటీ అనే భయం లేకుండా వీరు చేస్తున్నారా లేదా ఆ డేట్ కు హరిహర వీరమల్లు రాదన్న నమ్మకంతో వీరు ధీమా తో ప్రచారం చేస్తున్నారా ? అన్నది తెలియని పరిస్థితి. హరిహర వీరమల్లు షూటింగ్ యూనిట్ వర్గాల ప్రకారం ఈ సినిమా విడుదల కావాలంటే కనీసం ఓ ఐదు రోజులు అయినా పవన్ కళ్యాణ్ షూటింగ్ కు రావాల్సి ఉంది.
సినిమా విడుదల సరిగ్గా నెల రోజుల్లో ఉంది .. పోనీ మిగిలిన సీన్లు అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసి రెడీగా ఉంచుకున్న పవన్ సీన్లు యాడ్ చేయాలంటే ఐదు రోజులు షూటింగ్ చేయాలి .. ఐదు రోజుల పోస్ట్ ప్రొడక్షన్ చేయాల్సి ఉంటుంది అంటే .. 30 రోజుల్లో పది రోజులు దానికే పోతాయి .. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 21 వరకు ఉంటాయని తెలుస్తోంది .. ఈ టైంలో పవన్ కళ్యాణ్ షూటింగ్ కి రావటం అంటే కాస్త కష్టమైంది. శని .. ఆదివారా లు కూడా వర్క్ చేయాలి .. అలా రెండు మూడు సార్లు చేస్తే వర్క్ పూర్తవుతుంది .. ఇదంతా ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు.. ఏది ఏమైనా హరిహర వీరమల్లు టీం హడావుడి తప్ప మార్చి 28 కి సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ అయ్యే అవకాశం లేదు.