- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్లో పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న సినిమా రాజాసాబ్ .. ఈ సినిమా టాకీస్ దాదాపు పూర్తయింది .. పాటలు మాత్రం ఉన్నాయి. వేస్టేజ్ లేకుండా బడ్జెట్ లిమిట్స్ దాటకుండా సినిమా తీస్తారు దర్శకుడు మారుతి. అయినా కూడా రాజాసాబ్‌ నిడివి మూడు గంటల 30 నిమిషాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి ఇంకా పాటలు జోడించాలి అంటే ఎలా లేదన్న కొంత భాగం ఎడిటింగ్ లో కచ్చితంగా తీసివేయాలి .. పాటలు యాడ్ చేసిన తర్వాత టోటల్ ఫుటేజ్ మూడు గంటల 45 నిమిషాలకు చేరుతుంది. ఎంత అదనపు షాట్లు వేస్టేజ్ తీసేసిన కనీసం మూడు గంటల కు పైగా సినిమా ఉంచాల్సి వస్తుందట. సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ బేస్డ్‌ హర్రర్ టచ్ తో ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రభాస్‌ను ఫ‌న్ మోడ్ లో చూసి చాలా కాలం అయింది .. పైగా చాలా మంది కమెడియన్లు ఈ సినిమాలో ఉన్నారు.


సప్తగిరి - సత్య - ప్రభాస్ శ్రీను ఇలా చిన్న చిన్న క‌మెడియ‌న్లు చాలా మంది ఉన్నారు. ప్రభాస్ పూర్తిగా తన పాన్ ఇండియా హీరోయిన్ పక్కన పెట్టేసి కమెడియన్ల తో కలిసి ఫ‌న్‌ పండించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది .. ఓ కామన్ యాక్టర్ మాదిరిగా దెయ్యం ప‌డితే ఎలా ఉంటుంద‌న్న పాత్ర లో నటించిన అవకాశం ఉంది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ స‌లార్ 2 సినిమా చేస్తాడు .. ఆ త‌ర్వాత ఫౌజీ , స్పిరిట్ .. ఆ త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం లో క‌ల్కి 2 లాంటి సినిమాలు కూడా వ‌రుస‌గా లైన్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: