సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది తమ దగ్గరకు వచ్చిన పాత్రలను ఒక సమయంలో రిజక్ట్ చేయడం , ఆ తర్వాత ఆ సినిమా హిట్ అయిన అందులో ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చిన ఆ సినిమాను ఆ సమయంలో వదిలేసినందుకు వారు ఫీల్ కావడం , అదే సినిమా ప్లాప్ అయినా , వారి పాత్రకు ఎలాంటి గుర్తింపు రాకపోయినా ఆ రోజు ఆ సినిమాను వదిలేసి చాలా మంచి పని చేసాం అని ఆనంద పడటం జరగడం చాలా సర్వసాధారణమైన విషయం. ఇకపోతే ఓ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం తన వద్దకు వచ్చిన సినిమా రిజెక్ట్ చేయగా ఆ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆ సినిమాను రిజెక్ట్ చేసే చాలా బాధపడుతున్నారు అని చెప్పుకొచ్చింది. ఆ సినిమా ఏది ..? ఆ ముద్దుగుమ్మ ఎవరు ..? అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సుహాస్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వంలో కలర్ ఫోటో అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. దానితో ఈ సినిమా ద్వారా సుహాస్ , చాందిని చౌదరి కి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాను తెరకెక్కించిన విధానానికి సందీప్ రాజ్ కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాలో తనకు మొదట అవకాశం వచ్చింది అని ప్రియా వడ్లమాని  అనే నటి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

ఇకపోతే ఈ నటి ప్రేమకు రెయిన్ చెక్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాజాగా నాకు మొదటగా కలర్ ఫోటో సినిమాలో అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాను. కానీ ఆ సినిమా చేసుంటే బాగుండేది అని అనుకుంటున్నాట్లు ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: