హీరోగా, విలన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు హీరో ఆది పినిశెట్టి.. వైశాలి సినిమాకి సీక్వెల్ గా శబ్దం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది ఈ సినిమాని కూడా తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆది పినిశెట్టి తన సినీ లైఫ్ లో నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సైతం తెలియజేస్తూ ఉన్నారు.


అయితే గతంలో అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమాలో విలన్ గా నటించారు. ఇటీవలే ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది పినిశెట్టి మాట్లాడుతూ సరైనోడు చిత్రం తన కెరియర్ లోని ఒక స్పెషల్ చిత్రమని బోయపాటి గారు తనకి ఆఫర్ ఇచ్చినప్పుడు తాను నటించగలనో లేదో అనుకున్నానని.. కానీ సినిమా రిలీజ్ అయ్యి తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పడిందని తెలియజేశారు. సరైనోడు సినిమా రిలీజ్ కి ముందు ఇండస్ట్రీలో కొంతమందిని పిలిచి మరి షోలు వేయించారట..


ఆ స్పెషల్ షోలో చిరంజీవి కూడా సరైనోడు సినిమాని చూశారని తాను హైదరాబాదు నుంచి చెన్నైకి వెళ్తున్నప్పుడు చిరంజీవి గారే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారని.. సరైనోడు సినిమాలో బాగా యాక్టింగ్ చేశావని చెప్పారని చిరంజీవి గారి అంతటి వారే ఆ మాట అనడంతో తన కళ్ళల్లో నీళ్లు వచ్చాయని చిరంజీవి కాల్ చేశారని విషయం తన తండ్రికి తెలిసి తన తండ్రి కూడా ఎమోషనల్ గా మాట్లాడారని తెలిపారు ఆది పినిశెట్టి.


గతంలో ఆదిపిని శెట్టి తండ్రి చిరంజీవి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయట. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని వెల్లడించారు ఆదిప్పిని శెట్టి తండ్రి పేరు రవి రాజా పినిశెట్టి ఈయన ఒకప్పుడు డైరెక్టర్గా ఉండేవారు. చిరంజీవితో యముడికి మొగుడు, జ్వాల, ఎస్పి పరశురాం, రాజా విక్రమార్క తదితర చిత్రాలను కూడా తెరకెక్కించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: