మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి కన్నడ సినీ పరిశ్రమలో మంచి విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఈమె ఛలో అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత కూడా ఈమెకు మంచి విజయాలు దక్కడంతో చాలా తక్కువ కాలంలో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం పుష్పా పార్ట్ 1 అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఇండియా వ్యాప్తంగా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించింది. ఇక తాజాగా కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 2 మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో ఈమె క్రేజ్ ఇండియా వ్యాప్తంగా మరింతగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ విక్కీ కౌశల్ హీరోగా రూపొందిన ఛావా అనే హిందీ సినిమాలు హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.

ఇక ఈ మూవీ లోని రష్మిక నటనకు ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇకపోతే బాలీవుడ్ స్టార్ నటుడు రన్బీర్ కపూర్ సతీమణి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తాజాగా ఛావా మూవీలోని రష్మిక నటనపై ప్రశంసల వర్షం కురిపించింది. ఛావా మూవీ లోని రష్మిక కళ్ళు ఎంతో అద్భుతంగా ఉన్నాయి అని ఆమె రష్మిక పై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం రష్మిక గురించి ఆలియా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: