
ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కింది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు.
అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి హిట్ అందుకున్న సందర్భంగా ఇటీవల తండేల్ మూవీ సక్సెస్ మీట్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఆ ఈవెంట్ లో అందాల భామ బాంధవి మెరిసింది. ఈమె మసూద హారర్ సినిమాలో దెయ్యంగా నటించిన విషయం అందరికీ తెలుసు. ఆ పాత్రలో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ భామ 2019లో మిస్ ఇండియా, అలాగే మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకన్ గా కూడా నిలిచింది. అయితే బాంధవి చాలా రోజులుగా కనిపించకుండా.. ఒక్కసారిగా తండేల్ సినిమా ఈవెంట్ లో కనిపించే సారికి అందరి చూపులు తనపైననే పడ్డాయి.