చాలావరకు సినిమాల్లోని ఓ వెలిగిపోతున్న నటీనటులు చాలా మటుకు డాక్టర్ చదివి యాక్టర్‌గా స్థిరపడిన వారే. ఈ కోవకు చెందిందే డా. సాయి కామాక్షి భాస్కర్ల. "మా ఊరి పొలిమేర" చిత్రంతో ఈమె బాగా పాపులర్ అయింది. తాజాగా ఈ మహానటి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 1995 జూన్ 18న హైదరాబాద్‌లో జన్మించిన కామాక్షి భాస్కర్లకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కోరికగా ఉండేదట. దీనిలో భాగంగానే ఆమె చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. మెడిసిన్ పట్టా అందుకున్నాక అపోలో హాస్పిటల్‌లో కొన్నాళ్లు డాక్టర్‌గా పనిచేసి ఆ తరువాత మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలో 2018లో మిస్ తెలంగాణగా ఎంపికై అదే ఏడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లొచ్చారు కామాక్షి.

ఆ తరువాత ఆమె సినీరంగం వైపు అడుగుపెట్టి "ప్రియురాలు" అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసారు. కానీ ఆమెకి సీనియర్ కమెడియన్ సత్యం రాజేష్ హీరోగా నటించిన మా ఊరి పొలిమేరతోనే మంచి క్రేజ్ వచ్చింది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన కామాక్షి కెరీర్‌ను ఈ సినిమా మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే ఆ సినిమాకు సీక్వెల్‌గా పొలిమేర 2లో కూడా ఆమె అద్భుతంగా నటించింది. అంతేకాదండోయ్... ఈ సినిమాలో కేవలం హీరోయిన్‌గానే కాకుండా దర్శకత్వం, స్క్రిప్ట్ విభాగంలోనూ సేవలందించి తను మల్టీ టాలెంటెండ్ అని ప్రూవ్ చేసుకున్నారు కామాక్షి భాస్కర్ల.

కాగా చైనాలో ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో తాను పడ్డ కష్టాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు డాక్టర్ కామాక్షి. మొదటి నుంచి తనకు ఇల్లు, కాలేజీ తప్పించి మారే ప్రపంచం తెలియదని, కానీ ఎంబీబీఎస్ కోసం చైనాకు వెళ్లినట్లు చెప్పింది. చైనా వెళ్లాక అక్కడ ఇంగ్లీష్ మాట్లాడరని, అంతా వాళ్ల భాషలోనే మాట్లాడతారని తెలిసి మాండరీన్ నేర్చుకోవడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చింది. చైనాలో ఆరేళ్ల పాటు ఉన్న కామాక్షి, తాకి తానుగా వంట చేసుకునేదట. అయితే చైనీయులు బొద్దింకలు, తేళ్లు తింటారని తెలిసి వాటిని నేను కూడా రుచి చూసినట్లు తెలిపింది. దాంతో ప్రస్తుతం డాక్టర్ సాయి కామాక్షి భాస్కర్ల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: