మన తెలుగు చిత్ర పరిశ్రమ లో నాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ గా ఎదిగాడు .. అసిస్టెంట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన నాని .. ప్రజెంట్ వరుస‌ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు .. అయితే ఇప్పుడు తాజాగా ఈ స్టార్‌ హీరోకు సంబంధించిన ఓ క్రేజీ వార్త ఇండస్ట్రీని షేక్‌ చేస్తుంది .. ఇంతకీ అది ఏంటి అని అనుకుంటున్నారా ? అందరూ ఎంతో అభిమానించే హీరో నాని అసలు పేరు అది కాదట .. ఆయన అసలు పేరు ఇదే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది ఏంటో ఈ వార్తలో తెలుసుకుందాం.
 

ఇక తన సహజమైన నటనతో స్మైల్ తో ఎంతోమంది అభిమానులను తెచ్చుకున్నారు హీరో నాని .. ఈ హీరో అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టం .. ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని సినిమాలకు పనిచేసిన నానికి ఊహించని ల‌క్‌ కలిసి రావడంతో అనుకోకుండా హీరోగా మారి భారీ విజయాలు అందుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. అష్టా చమ్మ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నారు .. ఆ తర్వాత ఈగా సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు .. అలా వరుస‌ సినిమాలతో భారీ స్టార్ స్టేటస్ అందుకున్నాడు . మొదట్లో లవర్ బాయ్ గా కనిపించిన ఈ స్టార్ హీరో దసరా సినిమాతో మాస్ హీరోగా మారి తన నటనతో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు ..


అలాగే ఈ సినిమాలోని నాని యాక్టింగ్  కుప్రేక్షకుల నుంచి భారీ స్పందన కూడా వచ్చింది. ఇలా ఒకపక్క హీరోగా చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా మారి వరుస‌ సినిమాలను నిర్మిస్తున్నారు .. ఇలా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న హీరో ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని నిర్మించే హీరోగా మారడం చిన్న విషయం కాదు. అయితే ఇప్పుడు నాని అసలు పేరు ఇది కాదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .. అయితే నాని అసలు పేరు నవీన్ బాబు అంట .. ఇక ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తన పేరును నానిగా మార్చుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: