
ఇక అసలు మేటర్ లోకి వెళితే. ఈ అక్కినేని హీరో నాగచైతన్య , సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత మరో హీరోయిన్ శోభితతో ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి .. వాటిని నిజం చేస్తూ 2024 డిసెంబర్లో చైతు , శోభిత రెండో వివాహం చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి తర్వాత చైతు తండేల్ మూవీ రిలీజై భారీ విజయం కూడా అందుకుంది .. ఇక దీంతో అందరూ శోభిత అడుగుపెట్టిన వేల విశేషం చైతు భారీ విజయం అందుకుంటున్నారు అంటూ ఈ జంటను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇక శోభిత పెళ్లి తర్వాత ఎప్పుడూ చైతకు సంబంధించిన ఫోటోలు వారు వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తుంది .. ఈ క్రమంలోని తాజాగా నాగచైతన్యకు సంబంధించిన ఓ రేర్ ఫోటోను శోభిత షేర్ చేసింది. అందులో చైతు డీజే ప్లే చేస్తున్న ఫోటో ను శోభితా షేర్ చేయటంతో ఇది తెగ వైరల్ గా మారింది .. ఇక అందులో చైతు స్వెటర్ వేసుకుని డీజే ప్లే చేస్తూ కనిపించారు. ఇక దీంతో నాగచైతన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆయన అభిమానులు ఆ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.