
అయితే ఈ సినిమాలో దబిడి దిబిడి పాట మాత్రం మస్తు వైరల్ అయింది. ఈ పాటను చాలా ట్రోల్ కూడా చేశారు. తాజాగా దబిడి దిబిడి పాటకు ఓ ఎలుగుబంటి డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బాలయ్య అభిమాని దబిడి దిబిడి సాంగ్ పెట్టి జై బాలయ్య అని అరిస్తే.. ఆ సాంగ్ కి తగ్గట్టు ఎలుగుబంటి స్టెప్పులు వేసింది. ఇంకేముంది వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదిలా ఉండగా.. బాలయ్య బాబు అఖండ 2: తాండవం సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందే. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాను తెరకెక్కించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.