అక్కినేని హీరో నాగచైతన్య ప్రజెంట్ తండెల్ సినిమా సక్సెస్ ను ఆనందిస్తున్నాడు .. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 15 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా 100 కోట్ల మార్క్ సినిమాను అందుకున్నారు .. ఈ సినిమాలో నాగచైతన్య కు జంట‌గా సాయి పల్లవి పోటీపడి నటించింది .. నిజ జీవితంలో జరిగిన సంఘటనల‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కి ఘనవిజయం సాధించింది .. అలాగే ఈ సినిమా నిర్మాతలకు కూడా భారీ లాభాలు తెచ్చిపెట్టింది ..ఇక ప్రస్తుతం నాగచైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చేయబోతున్నాడు.


మరో స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా భారీ విజయాలతో దూసుకుపోతున్నాడు .. రీసెంట్గా విడుదలైన హిట్ 3 ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది .. స్టార్ హీరోల తర్వాత స్థానంలో నాని , విజయ్ దేవరకొండ , చైతన్య , రామ్ ఉన్నారు .. ఇక ఈ నలుగురిలో ఏ ఇద్దరు కలిసి మల్టిస్టార‌ర్ చేసిన బ్లాక్ బస్టర్ అందుకోవటం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి .. అలాగే చైతన్య - నాని కాంబినేషన్లో రావలసిన ఓ భారీ సినిమా మధ్యలో మిస్సయింది .. నాగచైతన్య - సునీల్ కాంబినేషన్లో తడాఖా సినిమా వచ్చిన విషయం తెలిసిందే .. చైతన్య కేరీర్‌ ఈ సినిమా అతిపెద్ద హిట్ గా నిలిచింది.
 

అయితే నిజానికి ఈ సినిమాల్లో ముందుగా సునీల్ కి బదులు నానిని అనుకున్నారు .. ఆ సమయంలో నానికి ఇప్పుడు ఉన్నంత మార్కెట్ క్రేజ్‌ లేదు .. అయితే ఆ సమయంలో డేట్లు ఖాళీ లేకపోవడంతో ఈ సినిమా కథ నచ్చినప్పటికీ నాని చేయడానికి కుదరలేదు .. ఇక దాంతో నానికి బదులుగా దర్శకుడు డాలి సునీల్ ను తీసుకున్నారు .. ఈ సినిమా రిలీజ్ తర్వాత మంచి విజయం అందుకుంది . అలా నాగచైతన్య - నాని కాంబినేషన్లో ఓ సినిమా మిస్సయింది .. ఇక ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా చేయడం కష్టమని కూడా సినీ విశ్లేషకులు అంటున్నారు .. ప్రజెంట్ ఓవర్సీస్ లో నాని మార్కెట్ మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , ప్రభాస్ రేంజ్ లో ఉంది .. ఇలాంటి సమయంలో మల్టీస్టారర్‌ చేయడానికి నాని ఒప్పుకుంటాడా ? అనేది కూడా సందేహమే అని ఫీల్మ్ న‌గ‌ర్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: