నటుడు హరీష్ ఉత్తమన్ గురించి పరిచయం అనవసరం. ఈయన విలన్ పాత్రలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. హరీష్ కేరళకు చెందిన వ్యక్తి. ఈయన తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించాడు. హరీష్ 2008లో తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈయన శ్రీమంతుడు, జిల్, గౌరవం, పండగ చేస్కో, పవర్, జై లవకుశ పుష్ప సినిమాలో నటించాడు. ఇక తాజాగా హిట్ కొట్టిన పుష్ప సినిమాలో కూడా ఈయన కనిపించారు. హరీష్ విలన్ పాత్రలలో చాలా సహజంగా నటిస్తారు. హరీష్ తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుని.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

హరీష్ ఉత్తమన్ 2018లో వివాహం అయింది. మేకప్ ఆర్టిస్ట్ అమృత కల్యాణ్ పూర్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని గొడవల కారణంగా విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 2022లో మలయాళం నటి చిన్ను కురువిల్లను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే తాజాగా భార్య కురువిల్లకు సీమంతం ఘనంగా జరిగింది. ఈ క్రమంలో సీమంతం ఫంక్షన్ కు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక సోషల్ మీడియాలో ఆ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ చూసిన ప్రేక్షకులు టాలీవుడ్ విలన్ హరీష్ ఉత్తమన్ భార్య ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే హరీష్ భార్య చిన్నకురువిల్ల మంచి మంచి మలయాళం సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఈ జంట వివాహ దినోత్సవం వేడుకను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హరీష్ ఉత్తమన్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా హరీష్ కి పలు సినిమాల్లో మంచి విలన్ పాత్రలు వచ్చే అవకాశాలు  ఉన్నాయని తెలుస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: