
కాగా ఈ సినిమాలో శృతి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శృతిమించి తన అందచందాలను ఆరబోసినట్టు చాలా స్పష్టంగా ట్రైలర్ ద్వారా స్పష్టమౌతోంది. ఇక ఆమె నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. కాగా ఇప్పటికే 'The Eye' చిత్రాన్ని లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్, గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించడంతో అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. 'The Eye' ఇండియన్ ప్రీమియర్ సందర్భంగా శృతి మాట్లాడుతూ.. సినిమా కథాంశం, అత్యుత్తమ నిర్మాణ నాణ్యతలకు ఈ ప్రాజెక్ట్ మరింత ప్రత్యేకమైనదని పేర్కొంది. కథలో ఇంటెన్సిటీని పెంచడానికి గ్రీస్ లోని ఏథెన్స్, కోర్ఫులోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించినట్లు తెలిపారు.
'The Eye' సినిమా కధాంశం విషయానికొస్తే... డయానా(శృతి హాసన్) అనే యువతి చుట్టూ తిరిగే కధ ఇది. ఆమె భర్త ఫెలిక్స్ (మార్క్ రౌలీ) ఒక మారుమూల ద్వీపంలో చిక్కుకోగా భర్త కనిపించకపోవడంతో దుఃఖంతో పోరాడుతున్న ఆమె ఎలాగైనా సరే... తన భర్త ఫెలిక్స్ ని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఆమె భర్తను తీసుకురావడానికి మార్గమైన పురాతన ఆచారం అయిన ఈవిల్ ఐ ఆచారానికి ఆమె ఆకర్షితురాలవుతుంది. అయితే అసలు ఈ ఈవిల్ ఐ ఆచారం అంటే ఏమిటి? దాని వల్ల ఆమెకు ఎదురైన సమస్యలేంటి? డయానా భర్త తిరిగి వచ్చాడా? అనే అంశాలతో సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది.