సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ స్టార్ హీరోలు అవ్వాలని వస్తుంటారు. మంచి గుర్తింపు తెచ్చుకుని, స్టార్ సెలబ్రిటీగా ఎదిగి  గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీలుగా ఉన్నవారంతా ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలలో నటించిన వారే. అందులో కొంత మంది కమిడియన్స్, కొంత మంది విలన్స్, మరికొందరు డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు.
 
ఈ క్రమంలో స్టార్ హీరోలుగా ఎదిగిన డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు వీరంతా గొప్ప స్థాయిలో ఉన్నారు. హీరో శివాజీ అంటే అందరికీ తెలుసు. ఆయన ఒక పాపులర్ నటుడు. శివాజీ ఇప్పుడు మంచి హీరోగా చేస్తున్నాడు. కానీ ఒక్కప్పుడు శివాజీ సైడ్ యాక్టర్ గా నటించాడు. ఆయన హీరో కాకముందు సినీ ఇండస్ట్రీకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వచ్చి పని చేశాడు. ఆ తర్వాత మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి మంచి మూవీస్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇప్పుడు ముఖ్య పాత్రలలో, విలన్ పాత్రలలో నటిస్తున్న నాజర్ అందరికీ తెలుసు. ఈయన దాదాపు 550కి పైగా సినిమాలలో నటించారు. ఈయన కూడా మొదట సినీ రంగలోకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే ఎంటర్ అయ్యాడు.

 
ఆయనతో పాటుగా రాజేంద్ర ప్రసాద్ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ ని ప్రారంభించారు. ఒక స్టార్ హీరోగా, ముఖ్య పాత్రలలో కనిపిస్తూ, కామెడీ చేస్తూ ఇప్పటికీ రాజేంద్ర ప్రసాద్ మంచి ట్రాక్ లో ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ అహా నా పెళ్లంట, లేడీస్ టైలర్ సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టాడు. ఆతర్వాత ఆ నలుగురు, శ్రీమంతుడు, జులాయి, నాన్నకు ప్రేమతో సినిమాలలో కూడా ముఖ్య పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: