
డైరెక్టర్ ఏది చెప్తే అది ఫాలో అయిపోతూ ఉంటాడు . డైరెక్టర్ చెప్తే చేసేస్తాను.. వద్దు అన్నాడు.. తన సినిమాలో ఏ హీరోయిన్ పెట్టుకోవాలో కూడా మొత్తం డైరెక్టర్స్ కి ఇచ్చేస్తూ ఉంటారు . రెమ్యూనరేషన్ కి తగ్గట్టు ఏ హీరోయిన్ బడ్జెట్ కి తగ్గినట్టు వస్తే ఆ హీరోయిన్ ఫైనలైజ్ చేయండి అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . అయితే అలాంటి బాలయ్య ఒక హీరోయిన్ విషయంలో మాత్రం చాలా కమిటెడ్ గా నోరు తెరిచి అడుగుతున్న సరే డైరెక్టర్ లు ఎవరు ఆ హీరోయిన్తో బాలయ్య కాంబో కుదరచలేకపోతున్నారు.
ఆ హీరోయిన్ మరెవరో కాదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఒకటి కాదు రెండు కాదు పలు ఈవెంట్లలో పలు ఇంటర్వ్యూలలో మరీ ముఖ్యంగా ఆన్ స్టాపబుల్ షో లో ఎన్నోసార్లు బాలయ్య తన ఫేవరెట్ హీరోయిన్ రష్మిక ..రష్మిక ..రష్మిక అంటూ ముద్దుగా క్ర్ష్మిక అని కూడా పిలిచేశారు. రష్మికతో నటించాలని ఉంది అంటూ చాలా సందర్భాలలో బయటపెట్టారు. అయితే రష్మిక మందన్నా బాలయ్య కాంబో మాత్రం అస్సలు సెట్ చేయలేకపోతున్నారు డైరెక్టర్ లు. రీజన్ ఏంటో తెలియదు కానీ వీళ్ళ కాంబో అసలు జనాలు కూడా ఊహించలేకపోతున్నారు. బాలయ్య ఏజ్ ఎక్కువనో.. రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనో తెలియదు కానీ వీళ్ళ కాంబో మాత్రం సెట్ కావడం లేదు . వీళ్ళ కాంబో సెట్ చేసే డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో అంటూ జనాలు వెయిటింగ్..!