మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది .. సినిమాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి మెగాస్టార్ గా క్రెజ్‌ తెచ్చుకున్నారు చిరంజీవి .. ఆ రోజుల్లో ఈయన ఏ సినిమా చేసిన బ్లాక్ బస్టర్ గా నిలిచేది .. అంతేకాకుండా ఈయన సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమా ధియేటర్ వద్ద ఉండే హడావుడి వేరు .. ఇప్పటికీ కూడా ఆ క్రేజ్ అలాగే ఉంది .. అయితే చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి లో వరుస‌ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటూ మెగాస్టార్ అనే బిరుదును అందుకున్ప‌రు.
 

అయితే అసలు విషయం ఏమిటంటే ఈ బిరుదు చిరంజీవికి కాకుండా మరో ఆగ్ర  హీరో అందుకనే వారట .. వరుసగా భారీ విజయాలనందుకుంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో అసలైన మెగాస్టార్ అయ్యే వారంట కానీ చివరకు చిరంజీవి తన అభిమానులు స్వయంగా ఈ బిరుదు ఇచ్చారు .. అయితే చిరంజీవి కాకుండా మెగాస్టార్ ట్యాగ్ అందుకునే హీరో ఇవ్వరా ? అనుకుంటున్నారా ? మన తెలుగు చిత్ర పరిశ్రమ లో అమ్మాయిల ఫాలింగ్ ఉన్న హీరో ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చే పేరు దివంగత అందాల నటుడు శోభన్ బాబు .. అందాల నటుడు గా నటభూషణుడిగా అప్పటివారు అయ‌న అందానికి ఫిదా అయిపోయేవారు .. అంతేకాకుండా అమ్మాయిల కలలు రాజు అంటే ఈ హీరోనే చెప్పేవారు అంతల అమ్మాయిల ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు శోభన్ బాబు.


అయితే అలా వరుసగా సినిమాలు చేస్తూ భారీ విజయాలు అందుకున శోభన్ బాబు , చిరంజీవి కంటే ముందు మెగాస్టార్ బిరుదు రావాల్సి ఉండేదట . ఆయనకు ఉన్న లేడీ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ కాకుండా ఆంధ్ర అందగాడు అనే బిరుదు ఇచ్చారట ఆయన అభిమానులు .. మెగాస్టార్ కంటే ఆంధ్ర అందగాడే శోభన్ బాబుకు బాగా నచ్చింది .. ఆయనకు సెట్ అవుతుందని ఆలోచించి ఆ టాగ్‌ను ఆయనకు ఫిక్స్ చేశారట. దాంతో అప్పుడప్పుడే మంచి ఫామ్ లో ఉంటూ భారీ విజయాలు అందుకుంటూ  భారీ అభిమానులు క్రియేట్ చేసుకుంటున్న చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు వచ్చి చేరింది .. అలా చిరంజీవికి మెగాస్టార్ అని ట్యాగ్ వచ్చింది .. శోభన్ బాబుకు మిస్ అయింది అని అంటారు టాలీవుడ్ పెద్దలు.

మరింత సమాచారం తెలుసుకోండి: