
ఎన్ని ఉన్నా ప్రెసెంట్ చిరంజీవి అడుగుపెట్టేది మాత్రం సంక్రాంతికి వస్తున్నాం దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలోనే. ఇక రీసెంట్ గానే డాకు మహారాజ్‌తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య నెక్స్ట్ సినిమా అఖండ 2 ఇప్పటికే సెట్స్ మీద ఉంది .. దీని తర్వాత గోపీచంద్ మలినేని సినిమా రానుంది .. అలాగే బాబీతో మరో సినిమా చేయడానికి కూడా ఓకే అన్నారు. అదేవిధంగా మన సీనియర్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరోలు .. వయసు జస్ట్ నెంబరే అంటున్నారు రజినీకాంత్ .. ఇప్పటికే కూలి రిలీజ్ కి రెడీ అవుతుంది ..
జైలర్ 2 ఇప్పటికే ఆన్ లోకేషన్ రెడీగా ఉంది .. మరోవైపు వెట్రిమోరన్ స్టోరీ కూడా సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా స్టార్ కమలహాసన్ అసలు ఖాళీగా లేరు .. ఇప్పటికే మణిరత్నం థగ్‌లైఫ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది .. అలాగే లోకేష్ కోసం ఖైదీ 2 లో గెస్ట్ రోల్ చేయాలి .. వీటితో పాటు కల్కి 2 , హెచ్ వి వినోద్ సినిమాలు ఉన్నాయి .. ఇవన్నీ అందరికీ తెలిసినవే ... ఇంకా లీక్ చేయనివి చాలానే ఉన్నాయి అంటున్నాడు కమలహాసన్ .. ఇలా సీనియర్ హీరోల స్పీడ్ చూసి యంగ్ హీరోలు కూడా ఒక్కసారిగా ఎలెక్ట్ కావాలంటున్నారు సినీ క్రిటిక్స్ .