
రీసెంట్ గానే జనవరి 10 న యేసుదాస్ 85 వ పుట్టినరోజు జరుపుకున్నారు .. ఇక దాంతో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా వెలువతాయి .. ఆరు దశాబ్దాలకు పైగా 50 వేలుకు పైగా పాటలు పాడారు యేసుదాసు ఆయన స్వరానికి ఎంతోమంది వీరు అభిమానులు ఉన్నారు. గాన గంధర్వన్ (ది సెలెస్టియల్ సింగర్) గా ఎంతో గొప్ప ప్రసిద్ధి చెందిన యేసుదాసు మలయాళం , తమిళం , కన్నడ , తెలుగు , అరబిక్ , రష్యన్ ఇలా అనేక భాషల్లో పాటలు పాడారు . కేజే యేసుదాస్ తన సంగీత జీవితంలో ఎనిమిది జాతీయ అవార్డులు , కేరళ , తమిళనాడు , ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్ నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకున్నారు ..
1975 లో పద్మశ్రీ , 2002 లో పద్మభూషణ్ మరియు 2017 లో పద్మవిభూషణ్ అవార్డులు కూడా వరించాయి .. అయితే యేసుదాస్ తన వయసుకు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని .. దీనికి కారణంగానే ఆయన ఆస్పత్రిలో చేరాలనే వార్తలు ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి .. అయితే ఇప్పుడు ఆయన కొడుకు విజయ్ యేసుదాస్ వాటిపై క్లారిటీ ఇవ్వటంతో ఇండస్ట్రీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి .. అభిమాన గాయకుడికి ఏమైందని సర్వత్ర ఆందోళన వ్యక్తం అయింది.