తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఈయన కెరియర్ను దేవదాస్ మూవీ తో మొదలు పెట్టాడు. ఈ మూవీ తో ఈయనకు మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. దానితో ఈయనకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఆ తర్వాత కూడా ఈయన ఎన్నో సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన వరుస పెట్టి అపజయాలను అందుకుంటున్నాడు.

కొంత కాలం క్రితం రామ్ "ది వారియర్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ఈయన హీరో గా రూపొందిన స్కంద , డబల్ ఈస్మార్ట్ మూవీ లు కూడా అపజయాలను అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం రామ్ పోతినేని , మహేష్ బాబు పి దర్శకత్వంలో రాపో 22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా కోసం రామ్ పోతినేని ఒక కొత్త పని చేసినట్టు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళ్తే ... సినిమా ఇండస్ట్రీ లో అనేక మంది హీరోలు తాము హీరోలుగా నటించిన సినిమాల్లో పాటలు పాడిన విషం మన అందరికీ తెలిసిందే.

కానీ తాము హీరోగా నటించిన సినిమాల్లోని పాటలకు లిరిక్స్ రాసిన వారు మాత్రం అత్యంత తక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న రాపో 22 సినిమాకు సంబంధించిన ఒక ప్రేమ గీతానికి లిరిక్స్ ను రామ్ పోతినేని రాసినట్లు తెలుస్తోంది. ఇలా రామ్ పోతినేని తన నెక్స్ట్ మూవీ కి లిరిక్స్ రాసినట్లు వార్తలు వస్తువు ఉండడంతో ఆ సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: