
అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అన్న విషయం ఆలస్యంగా బయటపడింది. అది కూడా ప్రభాస్ సినిమాలను అడ్డుకుంటున్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్ ...ఒక రెబల్ స్టార్... ఒక ఆరు అడుగుల అందగాడు ..ఇలా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే . ప్రభాస్ ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . అయితే ఇదే క్రమంలో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి.
ఆ సినిమా కారణంగానే మోక్షజ్ఞ సినిమాను మిస్ చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ అంటూ కూడా జనాలు మాట్లాడుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ప్రభాస్ కూడా ఈ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. స్క్రిప్ట్ మొత్తం విని కధ అంతా బాగుంది అని చెప్పి కాల్ షీట్స్ కూడా అడ్జస్ట్ చేశాక ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు నుంచి ప్రభాస్ తప్పుకోవడం పట్ల కొన్ని దుష్ట గ్రహ శక్తులు ప్రభావం ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. ఒక బడ సంస్ధ ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా ఫైనలైజ్ కాకుండా అడ్డుకుంది అని . ఇది ప్రశాంత్ వర్మపై తీర్చుకునే రివెంజ్ అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ప్రభాస్ - ప్రశాంత్ వర్మ సినిమాకి సంబంధించిన ఆగిపోయిన డీటెయిల్స్ బాగా వైరల్ గా మారాయి..!