
ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఈటీవీ విన్ రెండు ఏళ్లు పూర్తి చేసుకుని.. మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈటీవీ విన్ మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా మంచి క్రేజీ సినిమాలను విడుదల చేయనుంది. యువతకు నచ్చే సినిమాల నుండి మొదలు పెడితే.. వయసు మీద బడ్డావారికి కూడా నచ్చే సినిమాలను రిలీజ్ చేయనుంది. అయితే ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ రిలీజ్ చేసే సినిమాల లిస్ట్ ఎంతో ఇప్పుడు చూద్దాం.
హీరో సుమంత్ నటించిన అనగనగా సినిమాను ఉగాది కానుకగా విడుదల చేయనుంది. ఈ అద్బుతమైన సినిమాకు సన్నీ కుమార్ దర్శకత్వం వహించారు. అలాగే వర్షం బొల్లమ్మ, రాజీవ్ కనకాల తెరకెక్కించిన కానిస్టేబుల్ కనకం సినిమా కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమాకు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. వీటితో పాటుగా ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ ని కూడా రిలీజ్ చేయనుంది. జోసెఫ్ క్లింటన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో హర్ష రోషన్, భాను ప్రతాప్, హర్ష చెముడు. సింధురెడ్డి, జయతీర్థ కనిపించారు. లేట్ ఎందుకు అందరూ చూసేయండి.