శాంతినివాసం అనే సీరియల్ ఎపిసోడ్ కి డైరెక్టర్ గా పనిచేస్తూ.. తన కెరీర్ ను ప్రారంభించిన ఎస్ఎస్ రాజమౌళి తన కుటుంబ సభ్యులైన ఎంఎం కీరవాణి, వల్లి, కాలభైరవ, తో పాటు తన భార్య రమాతో కలసి పలు చిత్రాలు నిర్మిస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు. మొదట ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో కెరియర్ ఆరంభించిన రాజమౌళి, ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తనకంటూ ఒక ఇమేజ్ దక్కించుకోవడమే కాకుండా తన సినిమాలతో తెలుగు సినిమాకి కూడా ఒక గుర్తింపును క్రియేట్ చేశారు.

ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా..  ఇప్పటివరకు ఆయన పై ఎటువంటి నెగటివ్ ఇమేజ్ లేదనే చెప్పాలి.  అలాంటి ఈయనపై సడన్గా ఆయన ప్రాణ స్నేహితులు ఉప్పలపాటి శ్రీనివాసరావు మరణ వాంగ్మూలాన్ని అందిస్తూ ఒక సెల్ఫీ వీడియోని కూడా విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది చూసిన చాలామంది జక్కన్న పై ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు..  ఈయన మానసిక పరిస్థితి బాగుందా అంటూ కూడా కామెంట్ చేయడం గమనార్హం. శాంతినివాసం సీరియల్ సమయం నుంచి రాజమౌళికి, తనకు పరిచయం ఉందని, తామిద్దరిదీ దాదాపు 34 సంవత్సరాల స్నేహమని తెలిపిన ఆయన, మహాభారతం,  రామాయణం లలో ఎలాగైతే ఆడదాని వల్ల యుద్ధాలు వచ్చాయో.. మా మధ్య కూడా ఒక ఆడదాని వల్లే యుద్ధం మొదలైందని తెలిపారు.. ముఖ్యంగా తమది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలిపిన ఉప్పలపాటి శ్రీనివాసరావు ..  రాజమౌళి ఇప్పుడు తనను టార్చర్ చేస్తున్నారని, రాజమౌళి నుంచి ప్రాణహాని ఉంది అంటూ కామెంట్లు చేశారు.

పబ్లిసిటీ కోసం తాను ఇలా చేయడం లేదని, రాజమౌళి వల్లే తాను బ్యాచిలర్గా ఉండిపోయానని ఇప్పుడు అతడి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను.. ముందుగా రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయండి  అని కూడా ఉప్పలపాటి శ్రీనివాస్ రావు తెలపడంతో ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక దీనిపై రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: