అటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణి ఇప్పటికీ వరుసగా పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నది. సౌత్ లో పాటు నార్త్ లో కూడా ప్రియమణి బాగానే గుర్తింపు సంపాదించుకున్నది.. పలు రకాల వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో బిజీగా ఉన్న ప్రియమణి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.


ముఖ్యంగా వివాహం తర్వాత తను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రియమణి మతాంతర వివాహం చేసుకోవడమే తనకు సమస్యలకు దారితీసింది అని తెలిపింది. పెళ్లి చేసుకున్నప్పటికీ చాలామంది తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని కేవలం తనను మాత్రమే కాకుండా తన భర్త తనకు పుట్టబోయే పిల్లలని కూడా ఇందులోకి లాగేలా చేస్తున్నారని ప్రియమణి చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. 2017లో ముస్తాఫా రాజుని ప్రేమించి మరి వివాహం చేసుకున్నది ప్రియమణి. అయితే 2016 లో వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కాగా అప్పటి నుంచే ఆన్లైన్లో ఎక్కువగా వీరి మీద విమర్శలు వినిపించాయట.


అయితే ప్రియమణి ఎంగేజ్మెంట్ విషయాన్ని తన వాళ్లతో చెబితే సంతోషిస్తారనుకుంటున్న సమయంలోనే వారు కూడా తనని లవ్ జిహాద్ అంటూ ఇబ్బంది పెట్టారని వెల్లడించింది. తనపై లేనిపోని రూమర్స్ సృష్టించేవారని ఇంకా పుట్టని పిల్లల్ని కూడా ఇందులోకి లాగాలని చూస్తున్నారని తెలిపింది. ఈ విషయాలన్నీ విన్న తర్వాత తనకి చాలా బాధ కలిగింది అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది ప్రియమణి. తన భర్త గురించి తెలియని వారు కూడా ఇలా నెగిటివ్ కామెంట్స్ చేయడం చాలా బాధను కలిగించిందట. ఇప్పటికీ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తే చాలు ఆ ఫోటోల కింద పెట్టే కామెంట్స్ ని చూసి ఎన్నో సార్లు భయపడాల్సి వస్తోంది అంటూ వీటి వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: