
టాలీవుడ్ లో ఎలాంటి కాంట్రవర్సీలూ లేకుండా నెట్టుకురావడం చాలా గొప్ప విషయం. పైగా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు క్లీన్ ఇమేజ్ అంటే ఎంతో గొప్ప మనిషి .. మనసు అయి ఉండాలి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనపై ఇప్పటి వరకూ ఏ విషయం లో నూ ఒక్క ఆరోపణ లేదు. క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి రాజమౌళి .. ఈ విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు. అలాంటి రాజమౌళి ఇప్పుడు ఓ కొత్త కాంట్రవర్సీ లో చిక్కుకోవడం అందరిని ఆశ్చర్యం లో ముంచెత్తింది .. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది.
జక్కన్న స్నేహితుడు అంటూ యూ.శ్రీనివాసరావు అనే వ్యక్తి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇది తన మరణవాంగ్మూలం అని కూడా సదరు వ్యక్తి చెప్పడం కలకలం రేపుతోంది. ఇద్దరూ మంచి స్నేహితులమని, యమదొంగ సినిమాకి తాను ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్‌గా పని చేశానని కూడా సదరు వ్యక్తి చెపుతున్నాడు. ఇక కెరీర్ స్టార్టింగ్ లోనే తాను .. రాజమౌళి ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించామని ..ఆ అమ్మాయి విషయం లో తాను త్యాగం చేశానని.. తాను ఆ విషయం ఎక్కడ చెపుతానో అని రాజమౌళి తనను ఎంతో టార్చర్ పెడుతున్నాడని .. ఈ టార్చర్ తట్టుకోవడం కంటే చచ్చి పోవడమే బెటర్ అన్న నిర్ణయానికి తాను వచ్చానని శ్రీనివాసరావు చెపుతున్నాడు.
అయితే ఈ ఆరోపణలు చేస్తోన్న వ్యక్తి ఎవరో ఇప్పటకీ ఎవ్వరికి పూర్తి గా క్లారిటీ లేదు. అయితే అతడు గతం లో రాజమౌళి సినిమాలకు పని చేశాడని .. ఇప్పుడు రాజమౌళి పక్కన పెట్టడంతోనే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నట్టు టాక్ ?