కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్‌కు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల క్రితమే సంచలన సినిమాలను తెరకెక్కంచి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. అయితే ఇటీవల శంకర్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన గ్లోబల్ స్టార్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ‘ఇండియన్ 2’ పరాజయం తర్వాత కూడా శంకర్ ‘ఇండియన్ 3’ని ప్రకటించాడు. అయితే ఇండియన్ 2 నిరాశపరచడంతో ఇప్పుడు ఇండియన్ 3పై రకరకాల వార్తలు వస్తున్నాయి.ఇండియన్ 2 చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా, ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 3 చిత్రం నిర్మాణం తప్పుకుందని టాక్ వినిపిస్తుంది. రెడ్ జెయింట్ ప్రస్తుతం ఇండియన్ 3 చిత్రాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇండియన్ 2 చిత్రీకరణ సమయంలో, ఇండియన్ 3 షూటింగ్ సగం పూర్తయిందని దర్శకుడు శంకర్ ప్రకటించారు.ఇదిలావుండగా ఇండియన్-3 కోసం అనౌన్స్మెంట్ వచ్చింది. ఇండియన్-2 సినిమా లాస్ట్ లో మూడో పార్ట్ ట్రైలర్ ను రివీల్ చేశారు. ఆ తర్వాత ఇండియన్ 3 నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత అదేం లేదని శంకర్ తెలిపారు. థియేటర్లలో రిలీజ్ చేస్తామని చెప్పారు.

రీసెంట్ గా ఇండియన్ 3 కోసం మాట్లాడారు. ఇంకా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని శంకర్ చెప్పారు. అవన్నీ పూర్తి కావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని తెలిపారు. సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలను త్వరగా కంప్లీట్ చేసి కొన్ని నెలల్లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు.అయితే, ఇండియన్ 2 నుంచి భారీ నష్టం వాటిల్లిన కారణంగా లైకా ప్రొడక్షన్స్.. ఇండియన్ 3 నుంచి తప్పుకుందని బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రెడ్ జెయింట్ మూవీస్ ఇండియన్ 3 ప్రాజెక్ట్‌ ను పూర్తిగా టేకోవర్ చేయాలని యోచిస్తోంది. శంకర్, కమల్ హాసన్‌ తో ఇండియన్ 3 ప్యాచ్‌ వర్క్‌ ను పూర్తి చేయడానికి రీసెంట్ గా చర్చలు జరిగాయట.తక్కువ టైమ్ లోనే షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. కానీ లైకా సంస్థ సినిమా నుంచి తప్పుకున్నప్పటికీ ఇండియన్ 3 సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేయడంతో పాటు, షూటింగ్ లో 10% మాత్రమే పెండింగ్ లో ఉండటం వల్ల వారికి సినిమాలో క్రెడిట్ ఇవ్వనున్నారు. మరి ఇండియన్ 3 మూవీ మిగతా పార్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: