కొంత మంది హీరోయిన్ లకు నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయం దక్కడం , ఆ సినిమాతో సూపర్ సాలిడ్ క్రేజ్ రావడం , ఆ తర్వాత వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలా వరుస పెట్టి అవకాశాలు వచ్చిన వారిలో కొంత మంది కి మంచి విజయాలు దక్కినట్లయితే వారు స్టార్ హీరోయిన్ స్థానానికి చాలా తక్కువ సమయంలో చేరుకుంటారు. కానీ అలా చేరుకున్న తర్వాత మాత్రం వారు ఆ తర్వాత వరుస అపజయాలను అందుకొని ఇండస్ట్రీ కే దూరంగా ఉండేవారు కూడా ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మలలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ నటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈ బ్యూటీ సూపర్ సాలిడ్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత రకుల్ వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. దానితో చాలా తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు ఈమెకి మంచి విజయాలు వచ్చాయి.

దానితో ఈమె స్టార్ హీరోయిన్ గానే తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ కొనసాగించింది. కాకపోతే ఈమెకు తెలుగు లో ఆఖరుగా నటించడం ఐదు సినిమాల ద్వారా నిరాశనే మిగిలింది. ఈమెకు ఆఖరుగా 2017 వ సంవత్సరం విడుదల అయిన జయ జానకి నాయక సినిమా ద్వారా మంచి విజయం దక్కింది. ఆ తర్వాత ఈమె నటించిన స్పైడర్ , ఎన్టీఆర్ కథానాయకుడు , మన్మధుడు 2 , చెక్ , కొండపొలం అనే ఐదు తెలుగు సినిమాల ద్వారా వరుసగా అపజయాలు దక్కాయి. ఇక కొండపొలం సినిమా తర్వాత రకుల్ "బూ" అనే తెలుగు , తమిళ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక రకుల్ ప్రస్తుతం తమిళ్ , హిందీ మూవీలలో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: