
యమదొంగ చిత్రానికి సైతం శ్రీనివాస్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారట. అయితే వీటి ఆధారంగానే రాజమౌళి పైన సుమోటో కేసు నమోదు చేయాలంటూ కూడా పోలీసులకు సైతం విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈ వీడియో లెటర్ పైన క్లారిటీ రావాలి అంటే రాజమౌళి డిటెక్టివ్ టెస్ట్ చేయాలంటూ శ్రీనివాసరావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాజమౌళి వల్లే తాను మరణించబోతున్నానని తాను పబ్లిక్ సిటీ కోసం ఈ వీడియో చేయలేదంటూ వెళ్ళాడు.
అలాగే తనకు సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది ప్రముఖులు తెలుసని.. ఒక అమ్మాయి వల్లే తాను విడిపోయామని అందరి జీవితాలు అలాగే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ఉన్నది అంటూ తెలిపారు.. ఆర్యా -2 సినిమాలాగే మాది కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ.. ముగ్గురం కలిసి చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం అంటూ తెలిపారు. ముఖ్యంగా ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుందాము కలిసే ఉందామని చెప్పిన రాజమౌళి తిట్టి పంపించారని తెలిపారు శ్రీనివాస్. అయితే ఇదంతా రాజమౌళి స్టార్ డైరెక్టర్ కాకముందే జరిగిందంటూ తెలియజేశారు. అయితే ఈ విషయం ఎవరికో చెప్పానంటూ తనని టార్చర్ చేస్తున్నారని వెల్లడించారు శ్రీనివాస్. మొత్తానికి రాజమౌళి పేరు మాత్రం వివాదంలో నిలిచేలా కనిపిస్తోంది.