
అయితే తన తల్లి స్వగ్రామానికి వెళ్లిన బాలయ్య అక్కడ ఫోటోలు దిగుతూ ఉండగా తమ గ్రామాన్ని సైతం పట్టించుకోమని ఆ గ్రామస్తులు అడగగా ఫోటోలు దిగారుగా ఇక వెళ్ళిపోండి.. మాకు ఏమీ పని లేదా అంటూ తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు బాలయ్య.. అలాగే కొమరవోలు గ్రామము అదెక్కడ అంటూ చాలా వెటకారంగా కూడా మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు కొమరవోలు గ్రామానికి ఈ జన్మలో రాను అంటూ వాళ్ళంతా కూడా లింగాయతులు వాళ్ళను అసలు పట్టించుకోవాల్సిన పనిలేదు అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దీంతో మరొకసారి బాలయ్య విమర్శలు కూడా మూటకట్టుకుంటున్నారు.
గతంలో తమ అభిమానులను సైతం బాలయ్య కొట్టడం తిట్టడం వంటివి చేయడం వల్ల ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు మళ్లీ తన తల్లి స్వగ్రామమైన కొమరవోరుని పట్టించుకోనట్టు చెప్పడంతో అక్కడ సామాజిక వర్గాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడడంతో చాలామంది బాలయ్య పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలయ్య నిమ్మకూరులో తన తల్లితండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన తర్వాత మొదటిసారి నిమ్మకూరు కి రావడంతో అక్కడ గ్రామస్తులు సైతం బాలయ్యకు ఘనంగా స్వాగతం పలికారు. త్వరలోనే తన తండ్రి ఎన్టీఆర్కు కూడా భారతరత్న వస్తుందంటూ వెల్లడించడం జరిగింది బాలయ్య.