కన్నడ భామ రుక్మిణి వసంత్ ‘సప్తసాగరాలు దాటి’ మూవీ సిరీస్ తో మంచి గుర్తింపు అందుకుంది. అందులో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కన్నడ నాట రుక్మిణి స్టార్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తెలుగు, తమిళ్ భాషలలో కూడా తెరంగేట్రం చేసింది. తెలుగులోకి ఇప్పటికే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో రుక్మిణి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు.కన్నడంలో ‘బగీరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. శివరాజ్ కుమార్ తో ‘భారతి రంగల్’ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తమిళంలో విజయ్ సేతుపతి కి జోడీగా ‘ఏస్’ అనే సినిమా చేస్తోంది. అలాగే శివ కార్తికేయన్ ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలావుండగా రుక్మిణి వసంత్ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన బగీరా మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఇందులో ఆమె లుక్స్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో చాలా చక్కగా రుక్మిణి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెస్మరైజ్ చేసే అందంతో, మాయ చేసే నవ్వుతో ఇట్టే ఆకట్టుకుంటుంది.

ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఒక్క సక్సెస్ పడితే ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోతుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే రుక్మిణి వసంత్ బంపర్ ఆఫర్ కొట్టేసిందా అంటే అవుననే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అది కూడా ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో. ప్రస్తుతం అయన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు ఇటీవలే లాంఛనంగా మొదలయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యే దాకా వేరే సినిమా చేసే ఛాన్స్ లేదు. అందుకే రుక్మిణి మరో సినిమా సైన్ చేయలేదని తెలుస్తుంది. ఐతే తారక్ సినిమా పూర్తై రిలీజ్ అయితే మాత్రం రుక్మిణిని ఆపడం ఎవరి వల్లా కాదనిపించేలా క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. ఆల్రెడీ యూత్ అంతా అమ్మడి మాయలో పడిపోగా ఎన్టీఆర్ సినిమాతో టాప్ రేంజ్ కి వెళ్లబోతుంది. సో టాలీవుడ్ కి మరో స్టార్ హీరోయిన్ వచ్చినట్టే అని సౌడ్ చేయాల్సిందే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: