
ఇక కొన్నాళ్లుగా ప్యాన్ ఇండియా ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్నాడు నాని. ద ప్యారడైజ్ తో ఏకంగా వాల్డ్ ఆడియన్స్ ముందుకే డైరెక్ట్ గా వెళ్లబోతున్నాడు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను మార్చి 3న విడుదల చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ ను 8 భాషల్లో రిలీజ్ చేస్తారట. అయితే ఆశ్చర్యంగా ఇండియాతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 3న ఈ రా స్టేట్‌మెంట్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం అనౌన్స్ చేసింది.ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ది ప్యారడైజ్ కు సంబంధించి మార్చి 3న రిలీజ్ కాబోతున్న ఈ రా స్టేట్‌మెంట్ ను మేకర్స్ ఏకంగా 8 భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఇంగ్లీష్, స్పానిష్, హిందీ, బెంగాలీ భాషలతో పాటూ మరో నాలుగు సౌత్ ఇండియన్ భాషల్లో ఇది రిలీజ్ కానుంది. ఒక తెలుగు సినిమా స్పెయిన్ లో రిలీజ్ కానుండటం ఇదే మొదటిసారి.
స్పెయిన్ లో రిలీజ్ కానున్న మొదటి తెలుగు సినిమా నానిదే అవడం విశేషం. అంతేకాదు, ఈ సినిమా కోసం నానినే స్వయంగా స్పానిష్ లో డబ్బింగ్ చెప్పనున్నాడట. తన సినిమాలను వేరే భాషల్లో కూడా మార్కెటింగ్ చేసే విషయంలో నాని ఎప్పుడూ ముందుంటాడు. రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ లో అందరూ ఈ విషయాన్ని గమనించారు.ఏదో రిలీజవుతున్నాయంటే అవుతున్నాయని కాకుండా, తన సినిమా రిలీజవుతున్న ప్రతీ భాషలోనూ నాని ఆ సినిమాను ప్రమోట్ చేస్తాడు. అంతేకాదు, ఈ కథ అందరికీ తెలియాల్సింది అని తాను నమ్మితే మాత్రం నాని దాని కోసం ఏమైనా చేస్తాడు. కెరీర్ మొదటి నుంచి నాని ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇప్పటికే ది ప్యారడైజ్ మూవీ చాలా వయొలెంట్ గా ఉంటుందని అందరూ అంటున్న టైమ్ లో మేకర్స్ ఈ రా స్టేట్‌మెంట్ తో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో చూడాలి మరి.అంటే డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు పరిచయం అవుతాడన్నమాట. ఆల్రెడీ అతనికి ఓవర్శీస్ లో తిరుగులేని మార్కెట్ ఉంది. కాకపోతే అవన్నీ తెలుగు సినిమాలే. ఇప్పుడు వారి భాషలోనే వారికి పరిచయం కాబోతున్నాడు. మరి ఈ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.