ఒక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారాలి అంటే నటన టాలెంట్ తో పాటు కాస్త ఓపిక, అదృష్టం కూడా ఉండాలి.. అలా ఇండస్ట్రీలో పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన కొంతమంది హీరోలు ఎంత కష్టపడినా కానీ, స్టార్ డం   సంపాదించుకోలేరు.. మరి కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నారు.. అలా ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినటువంటి హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ఈయన మొదట్లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వీడి మొహానికి సినిమా హీరోనా అంటూ వెక్కిరించారు.. అయినా ప్రభాస్ అవి పట్టించుకోకుండా ఒక్కోమెట్టు ఎక్కుతూ చివరికి రాజమౌళి చేతిలో పడి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఈయనతో ఒక్కసారి నటిస్తే చాలని చాలామంది నటీనటులు అనుకునే రేంజ్ కు చేరుకున్నాడు. 

అలాంటి ప్రభాస్ కెరియర్ ను పూర్తిగా మార్చేసిన చిత్రం ఏంటయ్యా అంటే బాహుబలి..ఈ సినిమా తర్వాత ప్రభాస్ అదే రేంజ్ లో సినిమాలు చేస్తూ  బల అనిపించుకుంటున్నాడని చెప్పవచ్చు.. అలాంటి ప్రభాస్ తో ఏ హీరోయిన్ కైనా నటించాలని ఉంటుంది. ఇప్పటికి ఆయన చేసిన పాన్ ఇండియా చిత్రాల్లో చాలామంది హీరోయిన్లతో నటించారు.. అలాంటి ఈ స్టార్ గురించి తాజాగా ఒక యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.. ప్రభాస్ కూర్చోబెట్టి మరి నోట్లో  పెడతారని చెప్పుకొచ్చింది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా... ప్రభాస్ రాజా వంశానికి చెందినటువంటి హీరో.. ఒక రాజు రాజ్యంలోని ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని కోరుకుంటారు.. అదే లక్షణాలున్నటువంటి ప్రభాస్ తన ముందు ఎవరైనా సరే ఆకలితో ఉండకూడదని షూటింగ్ సెట్లో కానీ ఇతర సందర్భాల్లో కానీ ఎవరికైనా సరే ఆహారం అందిస్తూ ఉంటారు..

ముఖ్యంగా ప్రభాస్ చాలామంది హీరోలకు, హీరోయిన్లకు మంచి డిన్నర్ అందించి వార్తల్లోకి ఎక్కారు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ లలో శ్రీదేవి ఒకరు.. అయితే ఈమె తాజాగా ప్రభాస్ ఫుడ్ హ్యాబిట్స్ పై ఒక షాకింగ్ కామెంట్ చేసింది.. ప్రభాస్ మంచి ఫుడ్ లవర్ అని తన వద్దకు వచ్చిన ప్రతి అతిధికి ఆయన ప్రేమగా వంటలు వండించి వడ్డిస్తారని తెలియజేసింది.. అయితే ఆయనతో కూర్చొని మనం తిన్నప్పుడు ఆయన చాలా లిమిటెడ్ గా తిని ఇతరులకు దగ్గర ఉండి వడ్డిస్తూ నోట్లో ఆహారం పెడతారని చెప్పుకొచ్చింది.. ఈ విధంగా తాను తక్కువ తింటూ చీట్ చేస్తారని అన్నది.. ప్రభాస్ ఎంత తింటారో అంతకుమించి డైట్ ఫాలో అవుతారని తెలియజేసింది.. ఈ విధంగా ప్రభాస్ చీట్ చేయడంపై ఈ హీరోయిన్ కామెంట్స్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: