ప్రతి ఒక్కరి జీవితంలో చిలిపి పనులు, కొంటె పనులు అనేవి ఉంటే మనం ఎవరితో అయితే కొంటె పనులు చేశామో, మళ్లీ వారు ఫ్యూచర్ లో కలిస్తే వారితో మాట్లాడుకుంటూ వీటిని నెమరు వేసుకునే అవకాశం ఎంతో ఉంటుంది.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ గా వెలుగొందిన హీరో సిద్ధార్థ్ ను ప్రస్తుతం ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నటువంటి తమన్ చాలా వరకు హింసించాడట.. ఆ సినిమా షూటింగ్ మొత్తం ఆయనను టార్చర్ పెట్టాడట..ఆ హీరోనే కాకుండా సినిమా సెట్ లోని వారందరినీ ఆయన ఒక ఆట ఆడేసుకున్నారట.. ఈ విషయాన్ని తాజాగా తాను ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో అందరూ షాక్ అయిపోతున్నారు.. మరి ఆయన ఏ సినిమాలో ఇలా చేశారో వివరాలు చూద్దాం..మ్యూజిక్ డైరెక్టర్ తమన్  సినిమాల్లో నటుడుగా కూడా చేశారు. 

ఈయన అరివలగన్ డైరెక్షన్ లో ఆది పినిశెట్టి హీరోగా శబ్దం సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. అయితే ఈ సినిమా ఈరోజు విడుదల కావడంతో తాజాగా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బాయ్స్ సినిమా గురించి ఆయన మాట్లాడారు.. అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ నేను చాలా బాగా నటించామని కానీ సినిమా షూటింగ్ సమయంలో మా ఇద్దరికి అస్సలు పడేది కాదని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ కంటే ఎక్కువ పారితోషకం తీసుకున్నది నేనే అని అన్నారు.. షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ ఈ చిత్రంలో హీరో నేనే అని అంటే, నువ్వు హీరో అయితే ఏంటి, హీరోయిన్ అయితే నాకేంటి ఎక్కువ పారితోషకం నాకే అని హేళన చేసేవాడిని..

అయితే ఒక రోజు షూటింగ్ లో సిద్ధార్థ్ కు నైక్ సాక్స్ ఇచ్చి, నాకు నైలాన్ సాక్స్ ఇచ్చారు. వెంటనే చిత్ర యూనిట్ వద్దకు వెళ్లి ఇదేంటి నాకు చీప్ క్వాలిటీ సాక్స్ ఇచ్చారని వారితో కొట్లాట పెట్టుకున్నాను. అయితే ఈ సినిమా చేసే సమయంలో శంకర్ దగ్గర అసోసియేట్ గా అరివలగన్ పనిచేసేవారు. ఈ సినిమాలో నేను చేసే కొంటె పనులు ఆయన భరించలేకపోయేవాడు.. కేరవాన్ లో కరెంట్ ప్లగ్ తీసేయడం, బాత్రూంలో పైప్ లైన్ కట్ చేయడం ఇలాంటి పనులు చేసే వాడిది, వారికి నన్ను కంట్రోల్ చేయడం కోసం అరివలగన్ ను ప్రత్యేకంగా నియమించారు శంకర్. అలా ఆయన డైరెక్షన్ నేర్చుకోవడం కోసం వచ్చి ఈ సినిమా షూటింగ్ సమయంలో మొత్తం నన్ను చూసుకోవడమే సరిపోయిందంటూ సరదాగా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: