తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త ఒరవడిని అందించిన డైరెక్టర్ ఎవరయ్యా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రాజమౌళి మాత్రమే.. తెలుగు ఇండస్ట్రీని చీప్ గా చూసిన వాళ్లే తెలుగు ఇండస్ట్రీ గొప్పదని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాడు. అలాంటి రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలు తక్కువే అయినా అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్  హిట్టే అయ్యాయి. అలాంటి ఈయన ఏ హీరోతో సినిమా చేసిన 100% ఆ హీరోకు కథ సెట్ అయ్యేలా తీర్చిదిద్దుతారు.. అలా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినటువంటి మెగాస్టార్ తో మాత్రం ఒక సినిమా చేయాలనుకుని చివరికి తన తండ్రి వల్ల ఆ సినిమాను మానేశారట.. మరి ఆ సినిమా ఏంటి వివరాలు చూద్దాం.. దర్శక ధీరుడు రాజమౌళి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులకు గూస్ బంప్స్ వస్తాయి.. అలాంటి మెగా హీరో ఇండస్ట్రీలో చేయని పాత్రలు లేవు. 

ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాస్, కమర్షియల్ సినిమాలను అందించింది ఈయనే అని చెప్పవచ్చు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాల పాటు ఏలాడని చెప్పవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నూతన ఒరవడిని సొంతం చేసుకుంది. సరికొత్త పాన్ ఇండియా చిత్రాలతో ముందుకు వెళ్తోంది.. ఈ క్రమంలోనే చిరంజీవితో ఓ చిత్రాన్ని చేయాలని కథ రెడీ చేశారట రాజమౌళి. ఇంతకీ ఆ కథ ఏంటయ్యా అంటే మగధీర సినిమా కథ..ఈ స్టోరీ వినగానే మెగాస్టార్ కూడా ఎంతో మెచ్చి కథ బాగుందని చెప్పారట. అదే కాదు ఇందులో 100 మందిని చంపే ఐడియాని కూడా చిరంజీవి ఇచ్చి ఇది యాడ్ చేయమని అన్నారట.

అయితే ఈ కథ చెప్పే సమయంలో రాజమౌళి డైరెక్టర్ విజయ బాపినీడు, విజయేంద్ర ప్రసాద్ లను కూడా తీసుకెళ్లారట.. కథ మొత్తం చిరంజీవికి చెప్పిన తర్వాత వీరు మళ్లీ వెనుదిరిగే సమయంలో విజయ బాపినీడు, రాజమౌళిని, విజయేంద్ర ప్రసాద్ ను తన ఇంటికి తీసుకెళ్లి టీ తాగుతూ చిరంజీవికి గ్యాంగ్ లీడర్ లాంటి కమర్షియల్ సినిమాలు మాత్రమే సూట్ అవుతాయి. కానీ ఇలాంటి మగధీర లాంటి కథలు సెట్ అవ్వవు అని చెప్పారట. దీనిపై ఆలోచన చేసిన రాజమౌళి ఇంటికెళ్లాక విజయేంద్ర ప్రసాద్ తో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో విజయేంద్ర ప్రసాద్సినిమా చిరంజీవితో చేస్తే మీకు నిత్య ఘర్షనే ఉంటుంది మనశ్శాంతి ఉండదని ఆయనతో సినిమా వద్దని అన్నారట.. అలా ఈ సినిమా చివరికి రామ్ చరణ్ వద్దకు వెళ్ళింది ఆయన ఈ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: