ప్రతి వారం కూడా ఓటీటీలలో కొత్త చిత్రాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా ప్రముఖ ఓటీటీ ఛానల్ లో ఒకటైన ఈటీవీ విన్ లో నిన్నటి రోజున విడుదలైన చిత్రం కౌసల్య సుప్రజా రామ.. కన్నడలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగు ఆడియోస్ని ఆకట్టుకుందా లేదా చూద్దాం.


రామ్ (డార్లింగ్ కృష్ణ) చిన్న వయసు నుంచి అమ్మాయిలు అంటే చిన్న చూపుతో చూస్తూ ఉంటారట. అలా వయసు పెరిగే కొద్దీ ఆడవారి పైన ద్వేషం కూడా పెరుగుతుందట.  తన మేనత్త కొడుకు సంతు (నాగభూషణ) కు గర్ల్ ఫ్రెండ్ లేకుండా చేస్తూ ఉంటారట. అయితే ఇలాంటి వ్యక్తికి శివాని (బృందా ఆచార్య) ప్రేమలో పడతారు.. ఆ తర్వాత మగవాడిదే పై చేయి ఉండాలని రామ్ మనస్తత్వం కలిగిన రామ్ నుండి శివాని దూరం అవుతుంది.. కానీ ఆ సమయంలో రామ్  తల్లి మరణిస్తుంది. అయితే తన తల్లి చూసిన సంబంధమని ఎలాంటి పెళ్లిచూపులు జరుగుకుండా ముత్తు లక్ష్మి (మీలానా నాగరాజ్) తో పెళ్లి అవుతుందట. అప్పుడే అసలైన ఆట మొదలవుతుంది.. అయితే ఏ కారణంగా అయితే శివాని దూరమవుతుందో అంతకుమించిన మరి ఆటిట్యూడ్ తో ముత్తు లక్ష్మి ఉంటుందట. ఆ తర్వాత ముద్దుల లక్ష్మితో ఎందుకు సర్దుకుపోవాలి రామ్ లో వచ్చిన మార్పు ఏంటి అన్నది కథ.

ఈ చిత్రంలో ఫుల్ ట్వీస్టులు, పవర్ఫుల్ డైలాగులు, కామెడీ సన్నివేశాలు హైలెట్గా ఉన్నాయట. ముఖ్యంగా కథే ప్రధానంగా తెరకెక్కించిన సినిమా. లింగ వివక్షను కొందరు ఎలా ప్రోత్సహిస్తారు అన్నది ఇందులో చూపించారట. అయితే అమ్మ జ్ఞాపకాలతో మారిన విషయాన్ని కూడా అద్భుతంగా చూపించారు. ఈ చిత్రంలో హీరో ఫ్లాష్ బ్యాక్ పరిచయం చేసే సన్నివేశాల నుంచి కడుపుబ్బ నవ్వులు పూయిస్తుందట. అలాగే డైరెక్టర్ శశాంక్ ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా తెరకెక్కించారు.



మొత్తానికి కౌసల్య సుప్రజా రామా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నదని ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు కూడా లేవట. వినోదం పంచుతూ యూత్ ని బాగా ఆకట్టుకునే కోణంలో తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: