స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుపొందిన జీవి ప్రకాష్ హీరోగా పలు చిత్రాలలో నటించారు. కొన్ని సక్సెస్ అయిన మరికొన్ని ఫెయిల్యూర్ గా మిగిలాయి..
తాజాగా తన 25వ చిత్రం కింగ్ స్టోన్ అనే చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రం ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. కమల్ డైరెక్షన్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారట. జి స్టూడియోస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటివరకు కింగ్ స్టోన్ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచేలా చేశాయి.


దీంతో భారీ అంచనాల మధ్య వచ్చే నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకే రాబోతున్నది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్ సైతం వేగవంతం చేస్తూ తాజాగా కింగ్ స్టోన్ సినిమాకు సంబంధించి ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా ఈ ట్రైలర్  హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ విషయానికి వస్తే ఈ కడలి తనలో ఎన్నో సీక్రెట్స్ ని దాచి పెట్టింది.. అనే డైలాగ్ తో మొదలవుతుంది.. కొన్ని సీక్రెట్స్ గాలిలో కలిసిపోయినప్పటికీ మరికొన్ని సముద్రంలో దాగి ఉన్నాయి అంటూ డైలాగుతో మొదలవగా ఈ ట్రైలర్ అద్వంతం ఆకట్టుకునేలా కనిపిస్తోంది.


జీవి ప్రకాష్ నటన ఈ ట్రైలర్ లో మాత్రం బాగా ఆకట్టుకుంటోంది .మరి ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా జీవి ప్రకాష్ కి మరొక సక్సెస్ ని కూడా తీసుకువచ్చేలా చేస్తోందని అభిమానులు తెలియజేస్తున్నారు. ఉత్కంఠ బరిచేలా ఉన్న ట్రైలర్ సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ సృష్టిస్తోంది. తెలుగు లో కూడా ఈ సినిమా ట్రైలర్ అని రిలీజ్ చేశారు. మరి ఏ మేరకు ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి అంటే మార్చి ఏడవ తేది వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: