హీరో ఆది పినిశెట్టి కెరియర్ లోనే మంచి విజయాన్ని అందుకున్న చిత్రం వైశాలి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అరివళగన్ దర్శకత్వం వహించారు. అయితే మళ్లీ వీరి కాంబినేషన్లో శబ్దం సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వైశాలి చిత్రం నీటి ఆధారంగా తీయగా ఈసారి సౌండ్ బేస్ చేసుకుని మరి కథ రాసుకున్నారు డైరెక్టర్.


స్టొరీ:
హూలీ ఏంజెల్ కాలేజీలో వరుసగా విద్యార్థులు మరణిస్తూ ఉంటారు.. అయితే ఆ కాలేజీలో స్టూడెంట్స్ సైతం దెయ్యాలు ఉన్నాయని రూమర్స్ ని సృష్టించడం జరుగుతుంది. దీంతో కాలేజీ యాజమాన్యం సైతం ఈ కేసును డీల్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఆది పినిశెట్టి) ఎంట్రీ ఇస్తారు. అలా ఆ కాలేజీలో జరుగుతున్న వరుస మరణాల వెనుక ఏంటన్నది కనిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కాలేజీలోనే అవంతిక (లక్ష్మీ మీనన్) దెయ్యాలు లేవని తెలియజేస్తూ ఉంటుంది. అవంతిక ప్రవర్తనలో తేడా కనిపించిన వ్యోయ ఆ కాలేజీలోని ఆత్మను పట్టుకునే సమయంలో దీపిక అనే ఒక అమ్మాయి మరణిస్తుంది. దీంతో ఆ మరణాల వెనుక ఉన్నది ఎవరు?. కథ ఏంటన్నది ఈ సినిమా. ఈ సినిమాలో సిమ్రాన్, లైలా పాత్రలు ఏంటన్నది కూడా తెలియాల్సి ఉంది.


హర్రర్ సస్పెన్స్, థ్రిల్లర్ గా తీసిన ఈ సినిమా దేయ్యాల కథలకు ఒక రొమాంటిక్ ఫార్ములాగా మారిందట. మొదటి భాగం అంత ప్రేక్షకులను భయపెట్టిన సెకండాఫ్లో చప్పిడి లేకుండా పోయిందట. వైశాలి సినిమాలో ఆడియోస్ పాత్రలతో బాగా కనెక్ట్ అయ్యారు. కానీ శబ్దం విషయానికి వస్తే అది అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తోందట. మొదటి భాగం బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత సెకండ్ పార్ట్ కి కథ పూర్తిగా రొటీన్ గా మారిపోయిందట. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు ముందుగానే ఊహించవచ్చని ఈ చిత్రానికి క్లైమాక్స్ బాగా రాసుకొని ఉంటే మరింత ఉత్కంఠ పరిచేదని ఆడియన్స్ వెల్లడిస్తున్నారు.. ఫస్టాఫ్ సూపర్ అన్న ఆడియన్స్ సెకండ్ హాఫ్ ఇంతేనా అంటూ నిరాశపరిచారట. మరి పూర్తి రివ్యూ తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: