
అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషనల్ గా మారింది. చుట్టుపక్కల ఇంత మంది ఉన్నా సరే బాలయ్య ఏమాత్రం భయపడకుండా బెదరకుండా స్ట్రైట్ గానే ఆ బడా యాక్టర్ కి వార్నింగ్ ఇవ్వడం అప్పట్లో జనాలు ఎక్కువగా మాట్లాడుకున్నారు. మరీ ముఖ్యంగా బాలయ్య డేర్ నేస్ కి ఇది ప్రత్యక్ష నిదర్శనమంటూ పొగిడేసారు . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో ఎంతమంది తోపైన యాక్టర్లు ఉన్న బాలయ్య లాంటి హీరో రాడు రాబోడు అని చెప్పడంలో సందేహమే లేదు. ప్రసెంట్ బాలయ్య ఓ పక్క రాజకీయాలతో మరో పక్క సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు.
మరీ ముఖ్యంగా బాలయ్య కొడుకు సినీ ఎంట్రీ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొందరుబ్ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆయన ఎంట్రీ ఉంటుంది అంటుంటే..మరి కొందరు కాదు కాదు నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ఉంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య ఈ విషయంలో స్పందిస్తేనే త్వరలో ఫ్యాన్స్ కి ఓ క్లారిటీ వస్తుంది. చూద్దాం మరి బాలయ్య ఏం చేస్తాడో..??